కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరచాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సీహెచ్సీలు, పీహెచ్సీ డాక్టర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చిన అధునాతన పరికరాలను వినియోగించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.
గైనకాలజీ, పిల్లల వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు సమన్వయంతో గర్భిణులు, శిశువులకు సేవలు అందించాలన్నారు. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. డీఎంహెచ్ వో వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సనా, జీజీహెచ్ ఆర్ఎంవో నవీన పాల్గొన్నారు.
