కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ20 జట్టు ఎంపిక

 కాకా  వెంకటస్వామి మెమోరియల్ టీ20 జట్టు ఎంపిక

మహబూబాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ20 లీగ్​ కం నాకౌట్ వరంగల్ ఇంట్రా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్​కు మహబూబాబాద్ జిల్లా జట్టును శనివారం ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ 24 నుంచి 27 వరకు వరంగల్, ములుగు, జనగాంలలో జరిగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాకా వెంకటస్వామి మెమోరియల్ అంతర్ జిల్లాల టీ20 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయని తెలిపారు. 

మహబూబాబాద్ జిల్లా క్రికెట్ జట్టుకు బి.చరిత్ రెడ్డి, శశిధర్, జి.సాయి కుమార్, ప్రణయ్ గౌడ్, సంతోష్, శివ వర ప్రసాద్, నిషాంత్, దయానంద్, సాయి క్రిష్, ప్రణయ్ కుమార్, అనిర్వేశ్, ప్రణయ్, రాజేశ్, ధర్మ చరణ్ రెడ్డి, వంశీ, తరుణ్ ఎంపికయ్యారు. వీరిని మహబూబాబాద్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ కోచ్ మెతుకు కుమార్ అభినందించారు.