అచ్చంపేట, వెలుగు: ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ విశేష కృషి చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అభినందించారు. శనివారం హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్‌ను ఎమ్మెల్యే కలిసి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు.
అచ్చంపేట నియోజకవర్గంలో 174 జీపీలు ఉండగా,127 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. 73 శాతం స్థానాలను దక్కించుకొని రాష్ట్రంలో టాప్ టెన్ లో అచ్చంపేట నియోజకవర్గం ఉండడం హర్షనీయమన్నారు. కొత్త సర్పంచులకు పార్టీతో పాటు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని తెలిపారు.
