10 వేల ఏండ్ల తర్వాత పేలిన అగ్నిపర్వతం.. భారత్ వైపు దూసుకొస్తున్న బూడిద మేఘాలు

10 వేల ఏండ్ల తర్వాత పేలిన అగ్నిపర్వతం.. భారత్ వైపు దూసుకొస్తున్న బూడిద మేఘాలు

న్యూఢిల్లీ: ఈస్ట్ ఆఫ్రికాలోని ఇథియోపియాలో హేలీ గుబ్బీ అగ్నిపర్వతం 10 వేల ఏండ్ల తర్వాత పేలిపోయింది. దీంతో భారీ ఎత్తున బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే బూడిద మేఘాలు రెడ్ సీ మీదుగా ఒమన్, యెమెన్ దేశాలకు విస్తరించాయి. క్రమంగా అవి భారత్ వైపు దూసుకొస్తున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు గుజరాత్‎లోని జామ్​నగర్‎కు బూడిద మేఘాలు చేరుకున్నాయి. 

దీంతో ఆ మార్గంలో విమానాలను భారత విమానయాన శాఖ అధికారులు దారి మళ్లించారు. కేరళలోని కన్నూరు నుంచి అబుధాబికి వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్‎ను అహ్మదాబాద్​కు డైవర్ట్ చేశారు. బూడిద మేఘాల కారణంగా ఆ మార్గంలో విమానాలను నడపడం సాధ్యం కాదని, దీంతో ఫ్లైట్లను డైవర్ట్ లేదా క్యాన్సిల్  చేయడం చేస్తున్నామని అధికారులు తెలిపారు.