
న్యూఢిల్లీ: డెకరేటివ్ వాల్ ప్యానెల్ ఇండస్ట్రీ యూరో ప్రతీక్ సేల్స్ లిమిటెడ్ , రూ.451.32 కోట్ల విలువైన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రైస్బ్యాండ్ను రూ.235 నుంచి రూ.247 మధ్య నిర్ణయించింది. ఈ ఐపీఓ సెప్టెంబర్ 16న సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభమై, సెప్టెంబర్ 18న ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో ప్రమోటర్ల ద్వారా రూ.451.32 కోట్ల షేర్ల అమ్మకం మాత్రమే ఉంటుంది.
కొత్తగా షేర్లను జారీ చేయడం లేదు. యూరో ప్రతీక్ రెసిడెన్షియల్,కమర్షియల్ అవసరాల కోసం చాలా రకాల వస్తువులను తయారు చేస్తోంది. వీటిని యూరో ప్రతీక్, గ్లోరియో బ్రాండ్ల కింద అమ్ముతుంది. మార్చి 31, 2025 నాటికి, దీని పంపిణీ నెట్వర్క్ దేశంలోని 116 నగరాలకు విస్తరించింది. 180 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 28 శాతం పెరిగి రూ.284.23 కోట్లకు చేరింది. నికరలాభం 21.51 శాతం పెరిగి రూ.76.44 కోట్లకు చేరుకుంది.