
న్యూఢిల్లీ: భారత్‌లో ఇంకో ఐదేళ్లలో ఎలక్ట్రిక్ టూవీలర్ల (ఈ2డబ్ల్యూల) వాటా మొత్తం టూవీలర్ల అమ్మకాల్లో 40శాతానికి చేరుకుంటుందని ఏథర్ ఎనర్జీ తన యాన్యువల్ రిపోర్ట్‌లో పేర్కొంది. మొత్తం టూవీలర్ బండ్ల అమ్మకాలు 3–3.1 కోట్ల యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ2డబ్ల్యూల వృద్ధికి కొత్త లాంచ్‌లు, ప్రభుత్వ మద్దతు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, బ్యాటరీ ధరలు తగ్గడం, వినియోగదారుల ఆలోచన విధానాల్లో మార్పు వంటి అంశాలు దోహదపడతాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో మొత్తం టూవీలర్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ టూవీలర్ల వాటా 5.8శాతంగా రికార్డ్ అయ్యింది. స్కూటర్ల సెగ్మెంట్‌లో ఇది 15.7శాతంగా ఉంది. 2030–31 నాటికి స్కూటర్లలో ఎలక్ట్రిక్ బండ్ల వాటా 75% వరకు, మోటార్‌సైకిళ్లలో ఇది 10% వరకు పెరగొచ్చు.