పాతబస్తీలో కేటీఆర్ పాదయాత్ర.. MIM పర్మిషన్ ఉండాల్సిందే

పాతబస్తీలో కేటీఆర్ పాదయాత్ర.. MIM పర్మిషన్ ఉండాల్సిందే

మాజీ కార్పొరేటర్ ఖాజాబిలాల్ సంచలన వ్యాఖ్యలు…

హైదరాబాద్: కేటీఆర్ పై మాజీ కార్పొరేటర్ ఖాజాబిలాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీలో చేరిన సందర్భంగా స్థానిక మీడియాతో మాట్లాడారు. ఎలాంటి పదవిని ఆశించకుండా నేను మజ్లీస్ పార్టీతో జాయిన్ అయ్యానని స్పష్టం చేశారు. కేటీఆర్ మాటలు అరచేతిలో స్వర్గాన్ని చూపించేవిధంగా ఉంటాయని ఆయన ఎద్దేవా చేశారు. పాతబస్తీలో కేటీఆర్ పాదయాత్ర చేయాలన్నా MIM అధినేత అసదుద్దీన్ తో అనుమతి పాందాల్సిందేనన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి కొడుకు కావొచ్చు కానీ పాతబస్తీ ముఖ్యమంత్రి అసదుద్దీన్ ఒవైసీనేనని ఆయన పేర్కొన్నారు.

పాతబస్తీలో మతతత్వ పార్టీలకు జవాబు ఇవ్వడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపిన ఖాజా బిలాల్ మతతత్వ పార్టీలను పాతబస్తీలో గెలవనివ్వకుండా అడ్డుకోవాలన్నారు. బీజేపీ మరియు తెరాస ను పాతబస్తీలో ఒక్క వార్డ్ లో కూడా గెలవనివ్వమన్నారు. సెక్రటేరియట్ లో కూల్చిన ప్రార్థనా మందిరాలు పునర్ నిర్మించాలని డిమాండ్ చేస్తామన్నారు. గ్రేటర్ లో బీజేపీ మేయర్ పదవి కైవసం చేసుకుంటుందంటూ ప్రచారం చేస్తోంది..  దీన్ని మేము ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వబోమన్నారు. 2016లో వీళ్లకు ముగ్గురు కార్పొరేటర్లు లేకున్నా.. 2020లో మేయర్ కావాలనుకుంటున్నారని అన్నారు.  మైనార్టీ నాయకులు విడిపోతే..  మైనార్టీ ప్రజలందరికీ తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీలు విడిపోతే మతతత్వ పార్టీలకు లాభం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.