దేశం సంక్షోభంలో ఉన్నా.. అణుబాంబులపైనే పాక్ ఫోకస్

దేశం సంక్షోభంలో ఉన్నా.. అణుబాంబులపైనే పాక్ ఫోకస్
  • అప్పు తెచ్చి మరీ వెపన్స్ తయారీ
  • పాకిస్తాన్ వద్ద ప్రస్తుతం 170 న్యూక్లియర్ వార్ హెడ్స్
  • మస్రూర్ ఎయిర్​బేస్ దగ్గర్లో అణుబాంబులు స్టోరేజ్ 
  • అమెరికన్ సైంటిస్ట్ రిపోర్ట్​లో వివరాలు వెల్లడి 

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ ఆయుధ సంపత్తికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఆర్థికంగా చితికిపోతున్నా.. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. లీటర్ పెట్రోల్ రూ.300 దాటినా.. పాకిస్తాన్ మాత్రం తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతున్నది. న్యూక్లియర్ వెపన్స్, వార్​హెడ్స్, డెలివరీ సిస్టమ్స్, ఫిసైల్ మెటీరియల్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ డెవలప్​మెంట్ మాత్రం ఎక్కడా ఆగడం లేదని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ తన రీసెర్చ్ రిపోర్ట్​లో తెలిపారు.

ఆయుధ సామాగ్రి తయారీపై భారీ మొత్తంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నట్లు రీసెర్చ్ రిపోర్ట్​లో వెల్లడైంది. నిత్యవసర సరుకుల ధరలు, ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. విద్యుత్ సంక్షోభం కూడా పాకిస్తాన్ వేధిస్తున్నది. చాలా నగరాల్లో కరెంట్ కోతలు కొనసాగు తున్నాయి. కరెంట్ బిల్లులు కూడా భారీగా పెరిగిపోయాయి. ఆర్థిక సాయం కోసం చాలా కాలం పాటు చైనా, గల్ఫ్ దేశాల వైపు దీనంగా చూసింది. 

చివరికి బెయిలౌట్ కోసం ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) విధించిన కఠినమైన షరతులు అంగీకరించాల్సి వచ్చింది. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో కూడా అణ్వాయుధాలు పెంచుకోవాలన్న ఆతృత మాత్రం తగ్గలేదని స్పష్టమవుతున్నది. పాకిస్తాన్ చర్యతో పక్కనున్న ఇండియాతో పాటు ప్రపంచ దేశాలకు కూడా ముప్పు పొంచి ఉంది.

ఏడాదికి 14 నుంచి 27 వార్​హెడ్​ల తయారీ.. 

ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ వద్దే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని అమెరికా రిపోర్ట్​లో వెల్లడైంది. పాక్ లోని కీలక ప్రాంతాల ఫొటోలను కూడా అమెరికన్ కమర్షియల్ శాటిలైట్ రిలీజ్ చేసింది. ఈ ఫొటోల్లో పాకిస్తాన్ ఆర్మీ, వాయుసేనకు సంబంధించిన బేస్ క్యాంప్​ల వద్ద కొత్త న్యూక్లియర్ లాంచ్ ప్యాడ్​లు ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతున్నది. 

దీనికితోడు కొన్ని నిర్మాణపనులు కూడా చేపట్టినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 170 న్యూక్లియర్ వార్​హెడ్​లు ఉన్నాయని అమెరికన్ సైంటిస్ట్ అంచనా వేశారు. పాకిస్తాన్ ప్రస్తుతం ఏడాదికి 14 నుంచి 27 న్యూక్లియర్ వార్​హెడ్​లు తయారు చేసేందుకు సరిపడా రేడియో ధార్మికతను ఉత్పత్తి చేస్తున్నదని రీసెర్చ్ రిపోర్ట్​లో వెల్లడైంది. మిరాజ్ 3, మిరాజ్ 5 ఫైటర్ స్క్వాడ్రన్​లతో కూడా అణు బాంబులు ప్రయోగించవచ్చనే ఆలోచనలో పాకిస్తాన్ ఉన్నది.

న్యూక్లియర్ వెపన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్క

రాచీ బయట ఉన్న మస్రూర్ ఎయిర్​బేస్​లో మూడు మిరాజ్ స్క్వాడ్రన్​లతో (7వ స్క్వాడ్రన్ (డెకాయిట్లు), 8వ స్క్వాడ్రన్ (హైదర్స్), 22వ స్క్వాడ్రన్ (ఘాజీలు)) 32వ వింగ్ ఉంది. అణుబాంబులు ఉంచిన ప్రాంతం.. మస్రూర్ ఎయిర్​బేస్​లో నార్త్​వెస్ట్​కు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు శాటిలైట్ ఫొటోల ద్వారా తెలుస్తున్నది.

ల్యాండ్ బేస్డ్ బాలిస్టిక్ మిసైల్స్పా

కిస్తాన్ ప్రస్తుతం ఆరు అణు సామర్థ్యం, సాలిడ్ ఫ్యూయెల్, రోడ్ మొబైల్ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ కలిగి ఉన్నట్లు తెలుస్తున్నది. షార్ట్ రేంజ్ లో అబ్దాలీ (హతాఫ్​ 2), ఘజ్నవి (హతాఫ్​  3), షాహీన్ 1/ఏ (హతాఫ్​ 4), నస్ర్ (హతాఫ్​ 9), మీడియం రేంజ్​లో ఘౌరీ (హతాఫ్​ 5), షాహీన్ 2 (హతాఫ్​ 6) మిసైల్స్ ఉన్నాయి. మరో రెండు బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్స్ (మీడియం రేంజ్ షాహీన్ 3, మిర్వేద్ అబాబీల్) ను పాక్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నది. 

ల్యాండ్ బేస్డ్ మిసైల్ బేస్పా

కిస్తాన్ వద్ద కనీసం ఐదు మిసైల్ బేస్​లు ఉన్నాయని రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇవి పాకిస్తాన్ న్యూక్లియర్ ఫోర్సెస్​కు చాలా కీలకం. ఇందులో ఆక్రో బేస్, గుజ్రాన్​వాలా బేస్, ఖుజ్దార్ బేస్, పనో అకిల్ బేస్, సర్గోధ బేస్ ఉన్నాయి. పాకిస్తాన్​లో అణ్వాయుధాలు ఉన్నప్పటికీ.. వాటిని ఎలా కాపాడుకోవాలో తెలీదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పలుమార్లు విమర్శించారు. న్యూక్లియర్ సెక్యూరిటీ, కమాండ్ అండ్ కంట్రోల్ విధానంలో సమన్వయం ఉండదని, అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో పాక్ ఒకటి అంటూ చెప్పారు.