'కంటి వెలుగు'లో అందరూ పాల్గొనాలె : మంత్రి తలసాని

'కంటి వెలుగు'లో అందరూ పాల్గొనాలె : మంత్రి తలసాని

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంధత్వం లేని సమాజమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఇసామియా బజార్ లోని విక్టోరియా ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని మంత్రి తలసాని పర్యవేక్షించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఆరు లక్షలకు పైగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

1 లక్ష 53 వేల మందికి రీడింగ్ గ్లాసులను అందజేశామని మంత్రి తలసాని అన్నారు. మరో లక్ష 14 వేల మందికి ఒక నెల రోజులలో గ్లాసెస్ ను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3 లక్షల 52 వేల మందికి కంటి సమస్యలు లేనట్లు తేలిందన్నారు. 100 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని తలసాని కోరారు.