సభా వేదికపై 39 మంది ..

సభా వేదికపై 39 మంది ..

బీజేపీ విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో సభ జరగనుంది. ఈ సభా వేదికపై మొత్తం 39  మంది కూర్చోనున్నారు. ప్రధాని మోడీతో సహా 39  మంది సభ వేదికపై ఉండనున్నారు. మోడీకి ఓ వైపు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజ్నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, హరియాణా, అస్సాం, కర్ణాటక, గోవా, హిమాచలప్రదేశ్, ఉత్తరాఖండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎం. ఎల్. బిట్టర్, హిమంత బిశ్వశర్మ ,బసవరాజు బొమ్మై, ప్రమోద్ సావంత్, జయరామ్ రాగూర్, పుష్కర సింగ్ ధామి,  ఎన్. బీరేన్ సింగ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ ఆసీనులు కానున్నారు. 

రాష్ట్రం నుంచి వేదికపై..
సభా వేదికపై రాష్ట్రం నుంచి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్,  ఎంపీలు లక్ష్మణ్, అర్వింద్ , సోయం బాపురావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, నేతలు వివేక్ వెంకట స్వామి,  డీకే ఆరుణ, విజయశాంతి, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మురళీధర్ రావు, గరికపాటి మోహన్ రావు, ఇంద్రసేనారెడ్డి తదితరులు  కూర్చోనున్నారు. ప్రధాన వేదికకు ఎడమవైపున 100 మంది కూర్చునేలా మరో వేదికను  సిద్దం చేశారు.  కుడివైపు 7 వేల మంది ఆసీనులయ్యేలా మరో వేదికను ఏర్పాటు చేశారు.