Telangana Polling : పలు జిల్లాల్లో మెరాయించిన ఈవీఎంలు, బారులు తీరిన ఓటర్లు

Telangana Polling : పలు జిల్లాల్లో మెరాయించిన ఈవీఎంలు, బారులు తీరిన ఓటర్లు

తెలంగాణ రాష్ట్రంలో  17వ లోక్ సభ ఎన్నికలు ఐదవ దశ పోలింగ్ లో జరుగుతున్నాయి. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఎంత తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ బూత్ ల ముందు క్యూ కట్టారు. పలు జిల్లాలో అక్కడక్కడా కొన్ని ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఆయా పోలింగ్ సెంటర్లలో లైన్ లో నిలబడ్డ ఓటర్లకు ఓటేయడానికి కాస్త ఆలస్యమైంది.

మహబూబాబాద్ జిల్లా :-నెల్లికుదుర్ మండలం వావిలాల గ్రామంలో బూత్ 163 లో  మొరయించిన ఈవీఎం ఓటర్లు బారులు తీరారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా :-మలహార్ మండలం తాడిచేర్లలో బూతు నెంబర్ 248లో మొరాయించిన ఈవీఎం, పోలింగ్ నిలిచిపోయింది.

జగిత్యాల జిల్లా :- 30 నిమిషాలుగా ఈవీఎం మొరాయింపు వల్ల కోరుట్ల మండలం కిషన్ రావు పల్లెలోని ఏర్పాటు చేసిన 109వ బూతులో పోలింగ్ ప్రారంభం ఆలస్యమైంది. 

నిర్మల్ జిల్లా:-లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామంలో 189 పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం

నాగర్ కర్నూల్ జిల్లా:-అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్లబావి గ్రామంలో  217, 218 పోలింగ్ స్టేషన్లో ఈవీఎం లు మొరాయించడంతో ప్రారంభం కానీ పోలింగ్ బారులు తీరిన ఓటర్లు

మెదక్ జిల్లా:-టేక్మాల్ మండలం పల్వంచ గ్రామంలో ని 84 వ పోలింగ్ బూత్ లో పోలింగ్ ప్రారంభం అవ్వగానే మొరాయించిన ఈవిఏంలు.
 సరిచేయడానికి గంట టైం పడుతుందని అధికారులు చెప్పడంతో వెనుదిరిగిన ఓటర్లు.

 రాజన్న సిరిసిల్ల జిల్లా:- చందుర్తి మండలం మర్రిగడ్డలోని పోలింగ్ బూత్ 111లో ఈవీఎంలో సాంకేతిక లోపం కారణంగా 30 నిమిషాలు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభంమైంది.

రంగారెడ్డి జిల్లా:-రాజేంద్రనగర్ సర్కిల్ లోని హైదర్ గూడలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో 206  పోలింగ్ కేంద్రం గంటన్నర నుంచి EVM పని చేయడం లేదు. ఓటేద్దమని ఎంతో ఉత్సాహంతో వచ్చిన ఓటర్లు వెనుదిరిగారు.