ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? : మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్​

ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? : మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్​
  • కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం

  • 6 నెలల్లోనే ఆగమయ్యినం

  • మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్​

హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి జాడేది? ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు.. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. 

Also read : ఎస్పీ పేరుతో ఫేక్​ ఫేస్​బుక్​ అకౌంట్ .. ఫోన్​పే చేయాలంటూ మెస్సేజ్​​

సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా?  తెల్లవారుజామున 4 గంటలకు లైన్‌లో నిలబడితే.. సాయంత్రం 4 గంటల వరకూ విత్తనాలు ఇవ్వలేరా? దేశం కడుపునింపే స్థాయికి ఎదిగిన తెలంగాణలో అన్నదాతకే తిండితిప్పలు లేకుండా చేస్తరా? కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తరా?  ఇప్పటికైనా సరిపడా విత్తనాలు స్టాక్ తెప్పించాలి. బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా కళ్లెం వేయాలి. కాంగ్రెస్ వచ్చింది.. కాటగలిసినం. అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండి. లేదంటే రైతుల సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూడక తప్పదు’ అని కేటీఆర్‌ ట్విట్టర్​వేదికగా హెచ్చరించారు