కాంగ్రెస్ కు ఓటేసినందుకు రైతులు బాధపడుతున్నారు: నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ కు ఓటేసినందుకు రైతులు బాధపడుతున్నారు: నిరంజన్ రెడ్డి

పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదని.. కాని, కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామని రైతులు భాద పడుతున్నారని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్ లో నిరంజన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణలో ఈరోజు ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయని.. రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.  ఎండిన పంటలను మేకలకు, పశువులకు వదిలేస్తున్నారని చెప్పారు.  రైతుల ఆత్మహత్యలపై మాట్లాడకుండా ...ఇవాళ చర్చ అంతా రాజకీయాల వైపు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. రూ.15వేల రైతు బంధు ఏమైందని.. 500 రూపాయల బోనస్ ఏమైందని ప్రశ్నించారు. పాలన చేతనైతే రైతుల దగ్గరకు వెళ్లిన వాళ్ల బాధలు వినండన్నారు..

యాసంగి పంటల గురించి స్పష్టమైన హామి ఇవ్వమని తాను, హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని.. మా మాటలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు నిరజంన్ రెడ్డి. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడమే సరిపోతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఈరోజు కూడా 3 నుండి 4 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాటలు హాస్యస్పదంగా ఉన్నాయి. రుణమాఫీ అమలు చేపించి.. 500 బోనస్ ఇప్పించి వడ్లు కోనిపించండి.. గత వ్యవసాయ శాఖ మంత్రి కంటే మంచి పేరు తెచ్చుకొండని తుమ్మలకు సూచించారు.

ఉత్తర తెలంగాణలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.. దక్షణ తెలంగాణలో సగటు కంటే తక్కువ నమోదు అయింది.. అందుకే గోదావరి నీళ్లు ఎలా వాడుకోవాలో చెప్పిన మీరు.. ఇప్పుడు మాత్రం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువేనన్నారు. పంటనష్ట పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని..  ఇచ్చే వరకు రైతుల పక్షాన పోరాడుతామని హెచ్చారించారు. సేద్యానికి ఊపిరి పోసింది ఎవరు... ఉసురు పోసింది ఎవరని ఎన్నికల్లోకి వెళ్తున్నామన్నారు. మాట ఇచ్చి, తప్పిన కాంగ్రెస్ పార్టీకి ప్రజాశేత్రంలో బుద్ది చెబుతామని నిరంజన్ రెడ్డి అన్నారు.