యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తా: గడ్డం వంశీ

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తా: గడ్డం వంశీ

త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా మంచి మెజారిటీతో గెలవబోతుందన్నారు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.  ప్రచారంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని ... యువత నుండి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తుందన్నారు.  అన్నివర్గాల ప్రజల అండదండలతో పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తం చశారు. ఈమేరకు వంశీ మీడియాతో మాట్లాడుతూ..  పీజీలు చేసిన యువత సైతం ఉద్యోగాలు రాక ఆటోలు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని..  తనను గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి నియోజకవర్గం అన్నివిధాలా వెనుకబాటుకు గురైందన్నారు.  టెక్నాలజీలో ప్రపంచం మొత్తం దూసుకుపోతుంటే .. పెద్దపల్లిలో మాత్రం టెక్నాలజీ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిందని చెప్పారు. తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి పార్లమెంట్ ను అభివృద్ధి చేస్తానని చెప్పారాయన. ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి పరిధిలో ఉన్న అందరు ఎమ్మెల్యేలతో పాటు సెకండ్ లెవల్ క్యాడర్ కూడా సహకరిస్తున్నారని తెలిపారు. టాయిలెట్స్ లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాను ఎంపీగా గెలిచిన మరుక్షణమే వీటన్నిటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.