
సీఎం జగన్ వందరోజుల పాలనపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రులు దేవినేని ఉమ,కొల్లు రవీంద్ర. ప్రభుత్వం వందరోజుల్లో వందకు పైగా వైఫల్యాలు చేసిందన్నారు .రాజధాని,పోలవరం రివర్స్ టెండరింగ్ లలో అవినీతి అంటూ ఆరోపణలు చేసిన జగన్ ఏ ఒక్క అవినీతిని బయటపెట్టలేకపోయారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో తన ప్రభుత్వాన్ని తానే రద్దుచేసుకున్నా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు.పోలవరం విషయంలో జగన్ కోర్టు దిక్కారానికి పాల్పడ్డారని అన్నారు. కాంట్రాక్టులను మార్చుకుంటూ
పోతే పోలవరం ప్రాజెక్టు భద్రత ఎవరు వహిస్తారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం నిలిపివేతతో 27 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. జగన్ మూర్ఖత్వపు నిర్ణయాలతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈఎన్సీ వెంకటేశ్వరరావును తప్పించడం అన్యాయమని అన్నారు. రివర్స్ టెండరింగ్‌తో వ్యయం పెంచి దోచిపెట్టడం తప్ప చేసేదేం లేదన్నారు. 25 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు ఆ విషయం మర్చిపోయారని విమర్శించారు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్…అదే మాయలో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విమర్శించారు.