సొంతగూటికి చేరిన జూపూడి

సొంతగూటికి చేరిన జూపూడి

దసరా పండుగ పర్వదినం సందర్భంగా ఏపీ అధికార పార్టీ వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావులు  ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ చేస్తున్న పరిపాలన బాగుంది కాబట్టే పార్టీలోకి చేరామని ఆకుల, జూపూడి స్పష్టం చేశారు. ఐదుగురు దళితులకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత జగన్ దేనని జూపూడి కొనియాడారు.  ఫెడరల్ క్యాస్ట్రో  పాలనాలా జగన్ పాలన కొనసాగుతుందని చెప్పారు. దైర్య సాహసాలు ఉన్నటువంటి ఆంధ్రా ఐరన్ మ్యాన్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మరో వైపు నిరంతరం పది సంవత్సరాల పాటు  ఓదార్పు యాత్ర  , ప్రజాయాత్రలతో ప్రజల మధ్యలో ఉంటూ అనేక బాధల్ని చవిచూసినటువంటి  మిస్సైల్ జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు కోరుకున్న సుపరిపాలనతో ముందుకు సాగుతుందన్నారు. తాము తప్పిపోయిన గొర్రెల్లాగా పార్టీలు మారినట్లు నిర్మొహమాటంగా చెప్పారు. దేశం నివ్వెరపోయాలాగా ఐదురుగు దళితుల్ని కేబినేట్ లోకి తీసుకోవడంపై  ప్రధాని సైతం జగన్ పాలనపై చర్చించి 29రాష్ట్రాల్లో పాలన ఇలాగే ఉండాలని సూచించినట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుల్ని రాజ్యాంగ బద్ధంగా చూపించిన విధానం చాలా బాగుందని జూపూడి ప్రభాకర్ కొనియాడారు.