
RFCL ప్రారంభోత్సవానికి సీఎంను పిలిచే విషయంలో సరైన ప్రోటోకాల్ పాటించలేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. సంబంధిత మంత్రికి లేఖ రాసి ఆహ్వానించారు తప్ప.. పీఎంవో నుంచి సీఎంకు మాత్రం ఆహ్వానం లేదన్నారు. పెండ్లి పత్రిక కూడా ఇంటికి వెళ్లి ఇస్తారని.. అలాంటిది కేవలం పోస్టులో లేఖ పంపారని వినోద్ తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఇష్యూ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈడీ దాడులు చేస్తున్నారన్నారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
మోడీ టూర్ ఇలా
మోడీ శనివారం మధ్యా హ్నం 1.30కి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రధానికి బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడే బీజేపీ ముఖ్య నేతలతో మోడీ కొద్దిసేపు మాట్లాడుతారు. తర్వాత 2.15 గంటలకు ఎంఐ–17 హెలికాప్టర్‌లో రామగుండం బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 3.30కు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎఫ్‌సీఎల్)ను ప్రధాని ప్రారంభిస్తారు. సాయంత్రం 4.15కి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని పీఎంవో పేర్కొంది. అనంతరం రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్‌లో జరి గే బహిరంగ సభలో మోడీ మాట్లాడుతారు. రామగుండంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌తోపాటు మొత్తం రూ.9,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పీఎంఓ తెలిపింది.