విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 9, 10, 11 తరగతుల పరీక్షలు రద్దు

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 9, 10, 11 తరగతుల పరీక్షలు రద్దు
  • 9, 10, 11 తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సీఎం పళనిసామి ప్రకటన
  • పరీక్షలు లేకుండా డైరెక్ట్‌గా అప్పర్ క్లాస్‌కు ప్రమోట్
  • తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభ్యర్ధనలతో తమిళ సర్కార్ నిర్ణయం

కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో 9, 10, 11 తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తమిళనాడు సీఎం పళనిసామి గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రకారం.. 2020-21 విద్యా సంవత్సరంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పైన పేర్కొన్న తరగతుల విద్యార్థులు తదుపరి తరగతికి ప్రమోట్ చేయబడతారని సీఎం ధృవీకరించారు. గత సంవత్సరం కూడా కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్ చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యావంతుల నుంచి అనేక అభ్యర్ధనలు రావడంతో.. 9, 10 మరియు 11 తరగతుల పరీక్షలను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పళనిసామి తెలిపారు. కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది విద్యార్థులు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

For More News..

సూసైడ్ చేసుకుందామని ఐస్‌క్రీంలో విషం కలిపిన మహిళ.. అది తిని కొడుకు, చెల్లి మృతి