జూబ్లీహీల్స్‌‌‌‌‌‌‌‌ ఉపఎన్నిక నేపథ్యంలో 33 మద్యం బాటిళ్ల పట్టివేత

జూబ్లీహీల్స్‌‌‌‌‌‌‌‌  ఉపఎన్నిక నేపథ్యంలో 33 మద్యం  బాటిళ్ల పట్టివేత

హైదరాబాద్​ సిటీ, వెలుగు: జూబ్లీహీల్స్‌‌‌‌‌‌‌‌ ఉపఎన్నిక నేపథ్యంలో ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్​మెంట్‌‌‌‌‌‌‌‌ బీ టీమ్‌‌‌‌‌‌‌‌ సీఐ బిక్షారెడ్డి, ఎస్సైలు బాలరాజు , సంద్యా సిబ్బంది కలిసి పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. బాబా శాలిన్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో ఇద్దరు మహిళలు క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ మద్యం బాటిళ్లను అమ్ముతుండగా పట్టుకున్నారు. భవానీ, రమణ ఇద్దరు మహిళల నుంచి   33 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  మద్యం బాటిళ్లతోపాటు  ఇద్దరు మహిళలను అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో అప్పగించారు.