ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు

ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు
  • మైండ్ పవరే మజిల్ పవర్

హెల్దీగా, ఫిట్గా ఉండాలని అనుకోగానే చాలామంది జిమ్కెళ్లడం..వర్కవుట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. లేదంటే యోగా మొదలుపెట్టేస్తారు. మజిల్స్ స్ట్రెంథెన్ చేయాలని, బాడీ స్ట్రాంగ్ అవ్వాలని, కుదిరితే సిక్స్ప్యాక్ సాధించాలని పెద్ద గోల్ పెట్టుకుంటారు. లక్ష్యాలు మంచివే.  కానీ, దీనికోసం అనవసరమైన, శక్తికి మించిన ప్రయత్నాలు, ప్రయోగాలు చేయకూడదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫిట్నెస్ గోల్స్ సాధించే ముందు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలని చెబుతున్నారు  ఎనర్జైజర్ యోగా ఫౌండర్ కమల్ మలిరామని. అవేమిటో చూద్దాం!

ఫిట్‌గా ఉండటం అంటే బాడీ స్ట్రాంగ్ అవ్వడం ఒక్కటే కాదు. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఇందుకోసం ఎవరికి వాళ్లు తమ బాడీ టోన్ని ముందు అర్థం చేసుకోవాలి. తగిన డైట్ ఫాలో కావాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. బాడీ వెయిట్ మెయిన్టెయిన్ చేయాలి. ఇవన్నీ సరిగ్గా కుదిరినప్పుడే హెల్దీగా ఉంటారు. 

మెంటల్ హెల్త్
చాలామంది దీని మీద ఎక్కువగా దృష్టిపెట్టరు. మెంటల్గా హెల్దీగా లేనప్పుడు ఎంత ఫిట్గా ఉన్నా అర్థం లేదు. అందుకే మెంటల్ హెల్త్పై ముందు ఫోకస్ చేయాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. వర్క్ స్ట్రెస్, పర్సనల్ లైఫ్లోని స్ట్రెస్ పోగొట్టుకోవాలి. కోపం, చిరాకు వంటివి తగ్గించుకోవాలి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తే, దీని ఎఫెక్ట్ ఫిట్నెస్పై కూడా ఉంటుంది. యోగా, మెడిటేషన్ వల్ల స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. 

మంచి నిద్ర
పని ఎంత ఎక్కువున్నా, ఎంత హెవీ వర్కవుట్స్ చేసినా తిరిగి శక్తి పుంజుకోవాలంటే తగినంత నిద్రపోవాలి. రోజూ కనీసం ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. సరైన నిద్ర లేకపోతే, రోజంతా అలసటగా ఉంటుంది. పని సరిగా చేయలేరు. నీరసంగా ఉంటుంది. అప్పుడు ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. ఇది ఫిట్నెస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే విశ్రాంతి చాలా అవసరం.

మజిల్ బిల్డింగ్ కాదు..
బాడీ బిల్డింగ్ అవసరమనుకున్నప్పుడే మజిల్స్ గురించి ఆలోచించాలి. వాటి కోసం వర్కవుట్స్ చేయాలి. మజిల్స్ని విపరీతంగా పెంచాల్సిన అవసరం లేదు. సన్నగా ఉన్నా స్ట్రాంగ్గా ఉండొచ్చు. మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన వాళ్లలో విపరీతంగా ఎనర్జీ ఉంటుంది. కానీ క్రమం తప్పకుండా చేసేవాళ్ల మజిల్స్ కూడా అంత పెద్దగా, గట్టిగా ఉండవు. మజిల్స్ ఉంటేనే బలవంతులు అనుకోవద్దు. 

ఇన్నర్ స్ట్రెంత్ 
సన్నగా లేదా లావుగా కనిపించడం కాదు, బాడీలో ఉండే ఇన్నర్స్ట్రెంత్ ఇంపార్టెంట్. జిమ్లో గంటల తరబడి వర్కవుట్స్ చేసిన వాళ్లకన్నా, రోజంతా కష్టపడి పనిచేసే వాళ్లే మరింత స్ట్రాంగ్గా ఉంటారు. ఎక్కువ ఎనర్జీతో ఉండే వాళ్లలో చాలామంది చూడటానికి అంత స్ట్రాంగ్గా కనిపించరు. కాబట్టి, నిజమైన శక్తి మీలోనే ఉంటుంది. ఇన్నర్ స్ట్రెంత్ను పెంచుకోవాలి. ఆరోగ్యంగా ఉంటూ, ఎలాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్ లేకుండా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారంటే ఫిట్గా ఉన్నట్టే.

డైటే ఇంపార్టెంట్ 
అన్ని న్యూట్రియెంట్స్ ఉండే ఫుడ్ తినడం చాలా ముఖ్యం. అయితే, నేచురల్ ఫుడ్ తీసుకోవాలి. అవసరమైతే తప్ప మార్కెట్లో దొరికే సప్లిమెంట్స్ తీసుకోకూడదు. వీటి ద్వారా వచ్చే ఎనర్జీ టెంపరరీ. ఎలాంటి ఎనర్జీ అయినా, నేచురల్గా అందితేనే మంచి రిజల్ట్ ఉంటుంది. తినేటప్పుడు ఇతర పనులు చేయకూడదు. టీవీ చూడటం, ఫోన్ మాట్లాడటం మానేయాలి. సరిగ్గా నమిలి తింటేనే ఫుడ్ బాడీలో అమృతంలా పని చేస్తుంది. మంచి డైట్తోపాటు మైండ్ఫుల్ ఈటింగ్ చాలా ఇంపార్టెంట్. 

డైలీ వర్కవుట్స్
యోగా చేసినా, జిమ్లో వర్కవుట్స్ చేసినా అది డైలీ లైఫ్లో భాగం చేసుకోవాలి. 
ఏ రకమైన వర్కవుట్ అయినా కనీసం వారానికి ఆరు రోజులు ఉండేలా చూసుకోవాలి. బాడీ 
వెయిట్, బీఎమ్ఐ, హెల్త్ ప్రాబ్లమ్స్ వంటి అంశాల్ని దృష్టిలో పెట్టుకుని వర్కవుట్స్ ప్లాన్ చేసుకోవాలి.

మనలోనే శక్తి
యోగాలో ఫిట్గా ఉండాలనుకుంటే.. బాడీలోని ఇంటర్నల్ ఎనర్జీని గుర్తించాలి. ఫిట్నెస్ గోల్స్ సాధించాలంటే ఇన్నర్ స్ట్రెంత్ను బిల్డ్ చేసుకోవాలి. స్ట్రాంగ్ బాడీ, మజిల్స్ వంటివి కావాలన్నా ఎనర్జటిక్గా ఉండాలి. సరిగ్గా నిద్రపోవాలి. తిన్న ఫుడ్ డైజెస్ట్ అయ్యే కెపాసిటీ ఉండాలి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. అనవసర ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోకుండా, నేచురల్ డైట్ ఫాలో అవ్వాలి. లైఫ్లోని బేసిక్ ఎలిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఎవరైనా ఫిట్గా ఉంటారు.