బీఆర్ఎస్ తో కొట్లాడేందుకే బీజేపీలో చేరినం: మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి

బీఆర్ఎస్ తో కొట్లాడేందుకే బీజేపీలో చేరినం: మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
  • వివరణ అడగకుండా సస్పెండ్ చేస్తారా? 
  •  లిక్కర్ స్కాం పై ఎందుకు సైలెంట్ 
  • మునుగోడులో మూడు రోజులకు ముందు సీన్ ఎందుకు మారింది 

బీజేపీ రాష్ట్ర పార్టీపై బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.  1996 నుంచి బీజేపీలో ఉన్న తాను.. ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని.. అలాంటి నన్ను బీఆర్ఎస్తో కుమ్మక్కై నన్ను పార్టీ నుంచి బహిష్కించారని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.రానున్న రోజులలో బీజేపీ, బీఆర్ ఎస్ పొత్తు పెట్టుకుంటుందని, అందుకే తనను బయటికి పంపించారని అన్నారు. లిక్కర్ స్కాంను బీజేపీ పెద్దలే బయటపెట్టి ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారో చెప్పాలని యెన్నం కోరారు. 

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలున్నా.. చివరి మూడు రోజుల్లో సీన్ మారిపోయిందని, కేంద్ర బలగాలు సైలెంట్ మోడ్ లోకి వెళ్లాయన్నారు. బై ఎలెక్షన్ తర్వాత 6 నెలల వరకు అమిత్ షా రాజగోపాల్రెడ్డి ఎందుకు టైం ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను తనతో చర్చలు జరిపారని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.