
- జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహణపై ఎన్నికల సంఘం (ఈసీఐ) నిషేధం విధించింది. నవంబర్ 6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6.30 వరకు ఈ నిషే ధం అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధి కారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లను ఎగ్జిట్ పోల్స్ ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మార్గర్శకాలు జారీ చేసిందన్నారు.
న్యూస్ పేపర్లు, టీవీలు, రెడీయో, పత్రికలు, సోషల్, డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్‌కు, ప్రచార మాద్యమాలకు ఈ నిషేధం వర్తిస్తుందని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ప్రజాప్రతినిధుల చట్టం, 1951 ప్రకారం రెండేండ్ల జైలు శిక్ష, జరిమానా, కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉందన్నారు.