
రాబోయే రోజుల్లో దేశంలో స్టీల్ ఉత్పత్తిని డబుల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. గుజరాత్ లోని సూరత్ లో నిప్పన్ స్టీల్స్ హజారియా ప్లాంట్ విస్తరణ ప్రాజెక్ట్ కి ఆయన వర్చువల్ గా భూమి పూజ చేశారు.
భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వం 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. గతంలో రక్షణ ఉత్పత్తుల కోసం స్టీల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లమన్నారు. అయితే ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కింద INS విక్రాంత్ ను దేశంలోనే తయారు చేసినట్టు ప్రధాని మోడీ తెలిపారు.