మేడిగడ్డ రిపేర్ పనులు స్పీడప్ చేయండి... నిపుణుల కమిటీ

మేడిగడ్డ రిపేర్ పనులు స్పీడప్ చేయండి... నిపుణుల కమిటీ
  • వర్షాకాలంలోపు బ్యారేజీ వర్క్స్ పూర్తి కావాలి
  • ఇంజినీర్లను ఆదేశించిన నిపుణుల కమిటీ 
  • పనులను పరిశీలించిన ప్యానెల్ సభ్యులు
  • బొయ్యారం మూసేందుకు చేపడ్తున్న చర్యలపై ఆరా
  • నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశం
  • గేట్ల రిపేరు, బుంగలు పూడ్చే పనులపై పలు సూచనలు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ వర్క్స్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సోమవారం పరిశీలించింది. 20, 21వ పిల్లర్ల పక్కన బయటపడ్డ బొయ్యారం మూసేందుకు చేపడ్తున్న చర్యల గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు. గత కొన్ని రోజులుగా చేస్తున్న మరమ్మతు పనులపై ఆరా తీశారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే.. వర్క్ స్పీడప్ చేయాలని ఆదేశించారు.

వర్షాకాలం మొదలుగాక ముందే రిపేర్ వర్క్స్ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా, బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న తాజా పరిస్థితులను పరిశీలించారు. బ్యారేజీలోని 15 నుంచి 21వ పిల్లర్లు, గేట్ల వద్ద తొలగించిన ఇసుక మేటలను తనిఖీ చేశారు. గేట్ల రిపేరు పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న కుంగింది. దీంతో నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ) సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీ రక్షణ, పునరుద్ధరణ, పర్యవేక్షణ పేరిట నిపుణుల కమిటీ నియమించింది. కమిటీ చైర్మన్​గా నీటి పారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్, సభ్యులుగా ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ నిపుణులు నాగేందర్ రావు, మోహన్, రామగుండం సర్కిల్ సీఈ సుధాకర్ రెడ్డి ఉన్నారు. 

షీట్ ఫైల్స్, గ్రౌటింగ్​ పనులు తనిఖీ

సోమవారం ఉదయం బ్యారేజీ వద్దకు చేరుకున్న నిపుణుల కమిటీ.. బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7లో కుంగిన పిల్లర్లను పరిశీలించింది. 19, 20, 21వ పిల్లర్లు ఎంత మేర భూమిలో దిగబడిపోయాయో మెజర్​మెంట్స్ తీసుకున్నారు. వీటికి దగ్గరలోనే బయటపడిన బొయ్యారాన్ని పరిశీలించారు. అలాగే, భూమి పైభాగంలో ఏర్పడిన గుంతతో పాటు లోపల లీక్ అవుతున్న నీటి వేగాన్ని గమనించారు. భారీ బుంగలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై పలు సూచనలు చేశారు.

అలాగే, పిల్లర్ల కింద నుంచి డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్ట్రీమ్​ వైపు జరుగుతున్న వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీకేజీలను కూడా పరిశీలించారు. కుంగిపోయిన ఏడో బ్లాక్ లో జరుగుతున్న గేట్ల కటింగ్, షీట్ ఫైల్స్, గ్రౌటింగ్ పనులను తనిఖీ చేశారు. మరమ్మతు పనుల వివరాలను కమిటీకి ఎల్ అండ్ టీ, ప్రభుత్వ ఇంజినీర్లు వివరించారు. ఎన్​డీఎస్​ఏ ఇచ్చిన సూచనలను నిపుణుల కమిటీ లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్లకు వివరించింది. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీ ఇంజినీర్లను సైతం పనులను వేగవంతంగా చేయాలని ఆదేశించింది.

బ్యారేజీ దగ్గర జరుగుతున్న పనులివే..

మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ దగ్గర రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేగంగా జరుగుతున్నాయి. బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 7లోని 20, 21 పిల్లర్ల మధ్యలో యంత్రాల ద్వారా గ్రౌటింగ్ పనులు చేస్తున్నారు. భూగర్భంలో ఎంతవరకు ఇసుక నిల్వలు ఉన్నాయో ఈ గ్రౌటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా తెలుస్తుందని ఇంజినీర్లు చెప్తున్నరు. బ్యారేజీ దిగువన నీటి ప్రవాహం తట్టుకునేలా సీసీ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

బ్యారేజీ పిల్లర్ల దిగువన ఉన్న స్ట్రీమ్ వాల్ కొట్టుకుపోకుండా ఉండేందుకు డ్రిల్లింగ్ చేసి కాపర్ షీట్లను భూమిలోకి పంపుతున్నారు. గేట్ల వెనుక భాగంలో సీసీ పనులను చేస్తున్నారు. పిల్లర్ల కింది నుంచి లీకేజీ అయ్యి ఉబికి వస్తున్న నీటిని భారీ యంత్రాల సహాయంతో తోడేస్తున్నారు.