ఐఐటీలో జీహెచ్ఎంసీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజర్ విజిట్.. జీహెచ్ఎంసీ వర్కర్ల పిల్లల సందడి

ఐఐటీలో జీహెచ్ఎంసీ ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజర్ విజిట్..  జీహెచ్ఎంసీ వర్కర్ల పిల్లల సందడి

హైదరాబాద్ సిటీ, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని కంది ఐఐటీ క్యాంపస్ లో జీహెచ్ఎంసీ వర్కర్ల పిల్లలు శనివారం సందడి చేశారు. ఎక్స్‌‌‌‌‌‌‌‌పోజర్ విజిట్ చేయగా ఐఐటీ ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్​, వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్మికుల పిల్లల జీవితాల్లో ఆశల దీపం వెలిగించే వినూత్న ప్రోగ్రామ్ ను  జీహెచ్ఎంసీ తొలిసారి మొదలుపెట్టింది. ప్రతి సర్కిల్ నుంచి ముగ్గురు చొప్పున 180 మంది స్టూడెంట్స్ ను 6   బస్సుల్లో ఐఐటీహెచ్ క్యాంపస్ సందర్శనకు అధికారులు తీసుకెళ్లారు. క్యాంపస్ లోని ప్రత్యేకతల గురించి తెలుసుకున్నారు. ఐఐటీ ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ నిర్వహించారు.