ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు గడువు పెంపు

ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ద్వారా 2023–24 సంవత్సరానికి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 11 వరకు గడువు పొడిగించినట్లు టాస్ డైరెక్టర్ శ్రీహరి తెలిపారు. ఆసక్తి గలవారు https://www.telanganaopenschool.org  ద్వారా ఆన్‌లైన్​లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు వెబ్ సైట్​లో చూడాలని కోరారు.