హైదరాబాద్ కూకట్ పల్లి వాసులకు అలర్ట్.. ఈ నైట్ ఇళ్లలో ఉండటమే బెటర్..!

హైదరాబాద్ కూకట్ పల్లి వాసులకు అలర్ట్.. ఈ నైట్ ఇళ్లలో ఉండటమే బెటర్..!

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నానికి కారు మేఘాలు కమ్ముకుని వర్షం కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్ నగరం అంతటా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని.. నార్త్ హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజ్ గిరి, గాజులరామారం, RC పురం, పటాన్ చెరు, కాప్రా ఏరియాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని GHMC తెలిపింది.

నార్త్ హైదరాబాద్ ప్రాంతంలో 20 నుంచి 30 మిల్లీమీటర్లు, హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో 10 నుంచి 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర వాసులు ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది.

ALSO READ : వర్షాల వేళ.. గరం గరం పుదీనా రసంతో అన్నం తింటే..

మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే భారీ వర్ష సూచన చేసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌ సిటీలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తీవ్రత అధికంగా ఉందని ఐఎండీ తెలిపింది.