నా సక్సెస్ వెనుక F1 ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌: కేఎల్ రాహుల్

నా సక్సెస్ వెనుక F1 ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌: కేఎల్ రాహుల్

లండన్‌‌‌‌‌‌‌‌: టీమిండియా సీనియర్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కొన్నాళ్లుగా టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా విదేశాల్లో నిలకడగా ఆడుతున్నాడు. టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ను ఇష్టపడే రాహుల్ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌లో రెండో సెంచరీతో ఆకట్టుకున్నాడు. సవాల్ విసిరే ఇంగ్లిష్ పరిస్థితుల్లో ప్రత్యర్థి బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటున్న కేఎల్ క్లాసిక్ ఆటతో సిరీస్‌‌‌‌‌‌‌‌లో అత్యంత నమ్మకమైన బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారాడు. బాల్‌‌‌‌‌‌‌‌ను చక్కగా వదిలేయడం, ఆలస్యంగా ఆడటం వంటి స్కిల్స్ ఇంగ్లండ్ పరిస్థితుల్లో రాణించడానికి ఉపయోగపడుతున్నాయి. 

తన రియాక్షన్ టైమ్‌‌‌‌‌‌‌‌ను మెరుగు పరచుకోవడానికి ఫార్ములా వన్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌ వన్) ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌తో పని చేశానని, ప్రస్తుతం తన సక్సెస్‌‌‌‌‌‌‌‌కు ఇది ప్రధాన కారణమని రాహుల్ తెలిపాడు. ‘ఒకటి, రెండేండ్లుగా నేను కొన్ని మెంటల్ డ్రిల్స్‌‌‌‌‌‌‌‌పై దృష్టి సారించాను. నా రియాక్షన్ టైమ్‌‌‌‌‌‌‌‌ను ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడే ఒక ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌తో కొంత కాలం కలిసి పని చేశా. కొన్ని మెంటల్ డ్రిల్స్,  గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఆడితే రియాక్షన్ టైం మెరుగుపడుతుంది. నేను ఫార్ములా వన్‌‌‌‌‌‌‌‌లో వీటిని చాలా చూశాను.

 దాంతో ఆస్ట్రియాలోని సాల్జ్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌లో పనిచేసిన ఒక వ్యక్తి సాయంతో దీన్ని నేర్చుకున్నా. అక్కడికి వెళ్లి కొంతమంది కోచ్‌‌‌‌‌‌‌‌లతో పనిచేసే అవకాశం నాకు లభించింది. వాళ్లు ఫార్ములా వన్ టాప్‌‌‌‌‌‌‌‌ ఆటగాళ్లతో పాటు ఎంతో మానసిక దృఢత్వం అవసరమయ్యే ఇతర సాహస క్రీడల అథ్లెట్లతో పనిచేస్తారు. అది నాకు చాలా సహాయపడింది. ఈ మానసిక శిక్షణే  ఏడాది కాలంగా నా ఆటలో వచ్చిన ఏకైక మార్పు’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. 

పంత్ రనౌట్‌‌‌‌‌‌‌‌ మా జోరుకు బ్రేక్ వేసింది

జూనియర్ లెవెల్ క్రికెట్ నుంచి ఎక్కువ సమయం బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయడాన్ని తాను ఆస్వాదించేవాడినని కేఎల్ అన్నాడు. దీని వల్లే లార్డ్స్‌‌‌‌‌‌‌‌ లాంటి స్లో వికెట్‌‌‌‌‌‌‌‌పై తాను ఓపిగ్గా ఆడగలుగుతున్నానని చెప్పాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌‌లో సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఔటైనందుకు రాహుల్ నిరాశ చెందాడు. లంచ్ విరామానికి ముందు, తర్వాత వికెట్లు పడటం జట్టు జోరును దెబ్బతీసిందని అంగీకరించాడు. ముఖ్యంగా పంత్ రనౌట్ అవ్వడంపై రాహుల్ నిరాశ వ్యక్తం చేశాడు.

 ‘లంచ్‌‌‌‌‌‌‌‌కు ముందు వీలైతే నా సెంచరీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తానని పంత్‌‌‌‌‌‌‌‌తో చెప్పాను. లంచ్‌‌‌‌‌‌‌‌కు ముందు బషీర్ చివరి ఓవర్ వేస్తున్నందున అది నాకు మంచి చాన్స్ అనుకున్నా. కానీ దురదృష్టవశాత్తు నేను కొట్టిన బాల్‌‌‌‌‌‌‌‌ ఫీల్డర్ వద్దకు వెళ్లింది. బౌండ్రీ రావాల్సిన బాల్ అది. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో రనౌట్ జరిగి ఉండకూడదు. అది మా జోరుకు బ్రేక్‌‌‌‌‌‌‌‌ వేసింది. మా ఇద్దరికీ నిరాశ కలిగించింది’ అని రాహుల్ పేర్కొన్నాడు.