వెల్ఫేర్ లో ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్

వెల్ఫేర్ లో ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్
  • రాష్ట్ర సర్కారు నిర్ణయం త్వరలో అమలుకు కసరత్తు

హైదరాబాద్, వెలుగు: బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖల్లో ఉద్యోగులు, స్టూడెంట్స్ కు ఫేస్ రికగ్నేషన్  అటెండెన్స్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ లో  లక్షా 20 వేల మంది విద్యార్థులుండగా, సుమారు  8 వేల మంది ఉద్యోగులున్నారు. ప్రస్తుతం రిజిస్టర్​లో సంతకంతో అటెండెన్స్ తీసుకుంటున్నారు. వాస్తవానికి గతంలో వేలిముద్ర ద్వారా అటెండెన్స్ తీసుకోగా, కరోనా టైంలో తొలగించారు. అప్పటి నుంచి రిజిస్టర్​ ద్వారానే హాజరు తీసుకుంటున్నారు. 

త్వరలో ఆధార్ నంబర్ తో ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ తీసుకోవాలని నిర్ణయించగా.. పలు ఏజెన్సీలు ముందుకువచ్చాయి. వీరితో అధికారులు చర్చలు జరుపుతున్నారు. మరో వైపు ఉద్యోగి మొబైల్ అటెండెన్స్ యాప్ ను క్రియేట్ చేసి, ఆఫీస్ కు 50 లేదా 100 మీటర్ల పరిధి నుంచే పనిచేసేలా మరో యాప్ ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. వీటి ఏర్పాటుకు టీఎస్ టీఎస్ ( తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ) నుంచి సహకారం తీసుకునేందుకు లేఖ రాసినట్టు అధికారులు వెల్లడించారు.