అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత ప్రధాన పాత్రల్లో చిన్మయ్ రామ్ దర్శకత్వంలో నిఖిల్ ఎం గౌడ నిర్మించిన సినిమా ‘జిన్’. డిసెంబర్ 19న సినిమా విడుదల కానుంది. రీసెంట్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన రాజ్ కందుకూరి, సోహైల్, వీరభద్రం చౌదరి సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు చిన్మయ్ రామ్ ఆడియెన్స్ పెట్టే టికెట్ డబ్బులకు సరిపడా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని చెప్పాడు.
అమిత్ రావ్ మాట్లాడుతూ ‘దెయ్యాలు, ప్రేతాత్మల్ని ముస్లిం మతంలో జిన్ అంటారు. భూతాల్ని భయపెట్టి వదిలించే పూజారిని మౌళ్వి అంటారు. నేను ఇందులో మౌళ్వి పాత్రను పోషించాను. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నాడు. ఈ మూవీతో ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నామని ఇతర నటీనటులు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.
