
- వాట్సాప్,ఇన్ స్టా గ్రాం లదీ అదేతీరు
- ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన సేవలు
కౌలాలంపూర్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, వాట్సాప్ సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. సాయంత్రం నుంచే సమస్య ప్రారంభమైనా.. రాత్రి 10 గంటల ప్రాంతంలో పీక్స్టేజికి చేరుకుంది. ఫొటోలు, వీడియోలు డౌన్లోడ్కాక వినియోగదారులు ఇబ్బందిపడ్డారు. మెసేజ్లు సెండ్చేయడంలోకానీ, రిసీవ్చేసుకున్నపుడు కానీ సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఫేస్బుక్తీరుపై ట్విట్టర్లో మండిపడ్డారు. సింగపూర్, మనీలా, అమెరికా, లండన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ ప్రాబ్లం ఫేస్చేశారు. అయితే, సేవల్లో అంతరాయాన్ని గుర్తించామని, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఫేస్బుక్ట్వీట్చేసింది. ఫేస్బుక్ఆధ్వర్యంలోని కంపెనీల(ఇన్స్టాగ్రాం, వాట్సాప్)లోనే ఇలా జరగడం, అదీ ఈ ఏడాదిలో ఇది మూడోసారి కావడం గమనార్హం.