హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో వసతులు సూపర్.. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్

హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో వసతులు సూపర్.. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్

ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లిలోని హైదరాబాద్ సెంట్రల్​ లైబ్రరీని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్​పర్సన్ సీతా దయాకర్ రెడ్డి మంగళవారం సందర్శించారు. బాలలకు అందుబాటులో ఉన్న పుస్తకాలు, సౌకర్యాలు, వసతులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. పిల్లల కోసం ప్రత్యేక విభాగం, పఠన సౌకర్యాలను చూసి బాగున్నాయని కితాబిచ్చారు. 

పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు కల్పిస్తున్న సదుపాయాలను లైబ్రరీ కార్యదర్శి పొట్లూరు పద్మజ వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది చంద్రకళ, సీతామహాలక్ష్మి, అవినాశ్​రావు, వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్​యాదవ్, బొల్లం మహేందర్, కృష్ణారెడ్డి, పీడీ మహేశ్, అనిల్  పాల్గొన్నారు.