రాత్రి పూట చల్లటి ఏసీలో నిద్రపోతే.. కాలేయం రికవరీపై ప్రభావం చూపిస్తుందా.. ఇందులో నిజమెంత..?

రాత్రి పూట చల్లటి ఏసీలో నిద్రపోతే.. కాలేయం రికవరీపై ప్రభావం చూపిస్తుందా.. ఇందులో నిజమెంత..?

చల్లని ఏసీలో నిద్రపోతే మీ లివర్ సరిగ్గా పనిచేయదని, అనారోగ్యానికి కారణమవుతుందని ఈ మధ్య ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ ఫిట్‌నెస్ కోచ్  దీనికి సంబంధించి ఓ రీల్ షేర్ చేయడం  వల్ల ఈ చర్చ మొదలైంది.  

వైరల్ అవుతున్న వీడియోలో.. మీ ఏసీ గదిలో ఉష్ణోగ్రత 18 నుండి 19°C కంటే తక్కువగా ఉంటే, శరీరం  వేడిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు రక్త ప్రవాహం కాలేయం, జీర్ణవ్యవస్థ నుండి దూరంగా జరుగుతుంది. దీనివల్ల రాత్రిపూట కాలేయం చేసే 'డీటాక్స్' పని అంటే విషతుల్యాలను తొలగించడం, లివర్ క్లిన్  చేసే ప్రక్రియలు నెమ్మదిస్తాయి. దింతో ఉదయం నిద్రలేవగానే మనిషి నీరసంగా, అలసటగా అనిపిస్తాడు. అందుకే ఏసీని 22–24°C వద్ద ఉంచాలని  వీడియోలో సూచించారు.

డాక్టర్లు, సైన్స్  ఆధారాల ప్రకారం ఇది నిజం కాదు................ అసలు వాస్తవం ఏంటంటే   చల్లని ఏసీ రూంలో పడుకోవడం వల్ల లివర్  పనితీరు దెబ్బతింటుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. లివర్ ఒత్తిడికి సంబంధించిన పరిశోధనలు కేవలం జంతువుల మీద మాత్రమే జరిగాయి, మనుషులపై కాదు.

 ఏసీ బయట గాలిని మాత్రమే చల్లబరుస్తుంది, మన శరీర  వేడిని కాదు. మన శరీరం ఉష్ణోగ్రతను ఎప్పుడూ స్థిరంగా ఉంచుకోగలదు. లివర్ ఆరోగ్యానికి గది ఉష్ణోగ్రత కంటే నిద్ర నాణ్యత, సరైన ఆహారం, వ్యాయామం చాలా ముఖ్యం. నిజానికి, కొంచెం చల్లగా ఉన్న గదిలోనే గాఢ నిద్ర పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.