ప‌రిశ్ర‌మ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాలి

ప‌రిశ్ర‌మ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాలి

సంగా రెడ్డి- గ్యాస్, బాయిలర్ వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు మంత్రి హ‌రీష్ రావు. పరిశ్రమల కాలుష్యం, కరోనా నివారణకి తీసుకుంటున్న చర్యలపై సోమ‌వారం ఇండస్ట్రీ యాజమాన్యాలతో హరీష్ రావు సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న‌..వైజాగ్ ప్రమాద ఘటనతో అప్రమత్తం అయ్యామన్నారు. బాయిలర్, ఫైర్, సేఫ్టీ వాళ్ళు సరిగా ఇండస్ట్రీలను చెక్ చేయడం లేదనుకుంటున్నాను అన్నారు.

సంగారెడ్డి జిల్లాలో గత సంవత్సరం ఇండస్ట్రీ ప్రమాదాలతో 20 మంది చనిపోయారని చెప్పారు. పరిశ్రమల నుంచి రాత్రి సమయంలో విష వాయువులు వదులుతున్నట్లు త‌మ‌ దృష్టికి వచ్చిందన్నారు. సేఫ్టీ ఆఫీసర్స్ వాళ్ళ పని చేయడం లేదని.. కంపెనీ లలో కచ్చితంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు మంత్రి హ‌రీష్ రావు.