ఏపీలో పుట్టిన పిల్లలకు కూడా.. హైదరాబాద్ సిటీలో బర్త్ సర్టిఫికెట్లు.. ఇంత మోసమా..?

ఏపీలో పుట్టిన పిల్లలకు కూడా.. హైదరాబాద్ సిటీలో బర్త్ సర్టిఫికెట్లు.. ఇంత మోసమా..?

జీహెచ్ఎంసీలో కొందరు అధికారులు డబ్బులకు ఆశపడి ఎక్కడెక్కడో పుట్టిన పిల్లలు హైదరాబాద్ నగరంలో జన్మించినట్టు ఫేక్​బర్త్​సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నట్టు తేలింది. అలాగే, కొన్ని హాస్పిటల్స్​ కూడా వారికి ఇచ్చిన లాగిన్​ఐడీలను దుర్వినియోగం​చేస్తూ ఫేక్​బర్త్​సర్టిఫికెట్లు పొందుతున్నట్టు తెలిసింది. గతేడాది హోమ్ బర్త్లకి సంబంధించి ఒకేసారి 74 దరఖాస్తులు రాగా, అప్పటి కమిషనర్ ఇలంబరితి అనుమానంతో విచారణకు ఆదేశించారు. ఈ ఎంక్వైరీలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి.

ఫేక్​సర్టిఫికెట్లు పొందిన వారిలో ఒకరు ఏపీలోని వెస్ట్ గోదావరి ఆచంటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డెలివరీ కాగా, మరొకరు కర్నూల్ జిల్లాలోని నాగరూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రసవించినట్టు గుర్తించారు. ఇంకొకరు మెదక్ జిల్లా జిన్నారంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్​లో పుట్టగా..నగరంలోని ఓ ఇంట్లో పుట్టినట్టు సర్టిఫికెట్ పొందారు. ఇంకొకరైతే ఓ బిడ్డను దత్తత తీసుకొని తనకే ఇంట్లో బిడ్డ పుట్టిందని హోమ్ బర్త్ సర్టిఫికెట్ పొందారు.

అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో డెలివరీ కాగా, ఇక్కడ ఇదివరకే బర్త్ సర్టిఫికెట్ పొందారు. తర్వాత బిడ్డను కన్నతల్లి తన చెల్లికి దత్తత ఇచ్చింది. తర్వాత ఆ చెల్లెలు ఆ బిడ్డ తనకే పుట్టిందని హోమ్ బర్త్  సర్టిఫికెట్ తీసుకుంది. ఈ అడాప్షన్ లీగల్ అయితే జీహెచ్ఎంసీ అధికారికంగా బర్త్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. కానీ, వీరు ఇల్లీగల్ గా సర్టిఫికెట్ పొందడంతో ఫేక్ గా గుర్తించారు. ఈ నాలుగు సర్టిఫికెట్లను రద్దు చేయడంతో పాటు పేరెంట్స్ పై ఆయా పీఎస్​లలో జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు.

బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఓ చోట తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల తరుచూ ఫేక్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి.  దీంతో కొత్త విధానం ద్వారా సర్టిఫికెట్లు జారీ చేస్తే అక్రమాలకు చెక్ పడుతుందని బల్దియా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్)ను అమల్లోకి తేవాలనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఆఫీస్ ఆఫ్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా(ఓఆర్ జీఐ) ఆధ్వర్యంలోని ఈ పోర్టల్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా బర్త్, డెత్ సర్టిఫికెట్లు తీసుకునే వెసులుబాటు ఉంది.