హైదరాబాద్ నకిలీ సర్టిఫికెట్ లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. గచ్చిబౌలి లోని ఇందిర నగర్ లో జిరాక్స్ కేంద్రంగా దందా నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను 2025 నవంబర్ 15వ తేదీన అరెస్టు చేశారు. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్, నకిలీ వే బిల్స్, నకిలీ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్, మార్క్స్ మెమోస్, పాన్ కార్డులను సైతం నకిలీ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ కేసులో మహమ్మద్ సజీద్, గంట రాజీవ్ లను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ తెలిపారు. వారి నుంచి కంప్యూటర్, సీపీయూ, మొబైల్స్, ఫేక్ మెమో లు, థెరపి సర్టిఫికెట్స్, మెడికల్ రిపోర్ట్స్, ఫేక్ హోమ్ గార్డ్ ఐడి కార్డ్స్, జాబ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఫేక్ సర్టిఫికెట్స్ పొందిన 9 మంది వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
గచ్చిబౌలి పరిధిలో భారీగా పీజీ హాస్టల్స్, ఐటీ కంపెనీ లు ఉండడం తో ఫేక్ సర్టిఫికెట్స్ కు భారీగా డిమాండ్ వుందని అన్నారు. ఫేక్ సర్టిఫికెట్స్ పట్ల ప్రజలు జాగ్రత్త గా ఉండాలని సూచించారు.
