దొంగనోట్లు ముద్రిస్తున్న ఘరానా ముఠా అరెస్ట్

దొంగనోట్లు ముద్రిస్తున్న ఘరానా ముఠా అరెస్ట్

దొంగనోట్లు ముద్రిస్తున్న ఘరానా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన ఆరుగురు సభ్యుల ముఠా ఏజెంట్ల ద్వారా దొంగ నోట్లను చలామణి చేస్తున్నారు. కుప్పం మండలంలోని సామగుట్టపల్లిలోని ఓ ఇల్లుకు అద్దెకు తీసుకొని ఈ మోసానికి పాల్పడుతున్నారన్న సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ. 2,70,22,000 కోట్ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన ఇద్దరు, కుప్పం మండలం సామగుట్టపల్లికి చెందిన ఇంటి యజమాని,తిరుపతికి చెందిన మరో ముగ్గురు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. లక్ష రూపాయాల నకిలీ కరెన్సీని చలామణి చేస్తే రూ.10వేలు కమీషన్ ఇస్తూ ఏజెంట్ల ద్వారా దొంగ నోట్లను వీరు చలామణి చేస్తున్నారు. డిమానిటేషన్ సమయం నుంచి ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీలో పాత వెయ్యి రూపాయల నోట్లతో పాటు 2వేలు, 500 రూపాయల నోట్లు ఉన్నట్లు వెల్లడించారు.