వైద్యం పేరుతో క్షుద్రపూజలు.. హైదరాబాద్​లో నకిలీ డాక్టర్ అరెస్ట్

వైద్యం పేరుతో క్షుద్రపూజలు..  హైదరాబాద్​లో నకిలీ డాక్టర్ అరెస్ట్

ఎల్​బీనగర్,వెలుగు: వైద్యం పేరుతో క్షుద్రపూజలు చేస్తున్న నకిలీ డాక్టర్ ను హైదరాబాద్ లోని ఎల్​బీ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం సాహెబ్ నగర్ లో ఉండే దేవులపల్లి కార్తీక్ రాజు తలనొప్పి, నరాల బాధతో ఈనెల13న ఎల్బీ నగర్ లోని సిరీస్ రోడ్ సిరినగర్ కాలనీలోని జీఎన్ఆర్ ఆయుర్వేదిక్ క్లినిక్ లో చేరాడు. 

అక్కడ కేరళకు చెందిన నకిలీ డాక్టర్ జ్ఞానేశ్వర్ రెండేళ్లుగా నార్త్ ఇండియన్ గా చలామణి అవుతున్నాడు. ఈనెల 22న శుక్రవారం అమావాస్య ఉందని మరల అప్పుడు రావాలని చెప్పి అతని వద్ద రూ.50 వేలు తీసుకున్నాడు. అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.