
పోలీసుల ప్రొఫైల్సే టార్గెట్
రాజస్థాన్ ముఠాను పట్టుకున్నా వదలని బెడద
సౌత్ ఇండియాలో వందల మంది పేరిట నకిలీ ఎఫ్‌బీ అకౌంట్లు
జగిత్యాల, వెలుగు: నేరస్తులను పట్టుకునే పోలీసులకే సైబర్ కేటుగాళ్లు సవాల్విసురుతున్నారు. పోలీస్ఆఫీసర్ల పేరుతో పదే పదే నకిలీ ఫేస్బుక్ఐడీలు క్రియేట్చేస్తున్నారు. సైబర్ ముఠా బారిన ఎస్పీ నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు అందరూ పడ్డారు. నల్గొండ పోలీసులు ఇలాంటి కేసును సవాల్ గా తీసుకొని సుమారు 15 రోజుల పాటు రాజస్థాన్ లో మకాం వేశారు. తెలంగాణకు చెందిన 81 మంది పోలీస్ఆఫీసర్ల పేరుతో ఫేస్బుక్ఐడీలను క్రియేట్ నలుగురు నిందితులను ఈ నెల 3న అరెస్ట్‌చేశారు. అయినప్పటికీ నకిలీ ఫేస్బుక్ఐడీల బెడద మాత్రం తీరలేదు. ఇలాంటి నిందితులు ఇంకా చాలామంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సౌత్ ఇండియాకు చెందిన వందలాది మంది నకిలీ ఫేస్బుక్ఐడీలను ఇప్పటికే క్రియేట్చేసినట్లు సమాచారం.
పోలీస్ యూనిఫామ్‌తో ఫొటో కనిపిస్తే..
కేటుగాళ్లు ముఖ్యంగా ఫేస్బుక్లో పోలీస్‌డ్రెస్‌తో కనిపించేవారిని ఎంచుకుని వారి పేరుతో ఫేక్‌ఐడీలు క్రియేట్చేస్తున్నారు. వారు పంపినట్లుగా ఫ్రెండ్రిక్వెస్టులు పెట్టడం, తర్వాత అర్జెంట్‌గా డబ్బులు పంపాలంటూ కోరుతున్నారు. నెల రోజులుగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నల్గొండ ఎస్పీ రంగనాథ్ పేరుతో అకౌంట్క్రియేట్చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో ఒక్కొక్కరు తమ పేరుతో నకిలీ ఐడీ క్రియేట్చేశారని, ఎవరూ డబ్బులు పంపవద్దంటూ తమ ఒరిజినల్ అకౌంట్ నుంచి అందరికీ మెసేజ్ పెడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో పని చేస్తున్న సీఐ కరుణాకర్ రావు, జనగామ సీఐ మల్లేష్, జగిత్యాల జిల్లాలో ఒకరు, కాటారంలో ఒకరు, కరీంనగర్ లో ఓ కానిస్టేబుల్ ఇలా సైబర్ కేటుగాళ్ల బారిన పడ్డారు. ఇలాంటి ఘటనల్లో నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఉంటున్నారు. వారిని ఆ రాష్ట్రానికి వెళ్లి పట్టుకోవాలంటే కొంచెం కష్టమైన పనే. అదే సమయంలో ఖర్చూ బాగానే అవుతుంది. దీంతో పోలీసులు వారి పేరుతో నకిలీ ఐడీ క్రియేట్చేసినట్లు తెలిస్తే అదే విషయాన్ని తెలిసినవారందరికీ మెసేజ్పెడుతున్నారు.
అడ్డుకట్ట ఎలా..
నకిలీ ఫేస్ బుక్ ఐడీ క్రియేట్చేయకుండా ఉండాలంటే ఎవరికి వారే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట వారి పేరుతో మరో అకౌంట్ ఉందో లేదో చెక్‌చేసుకోవాలి. తర్వాత ఒరిజినల్ అకౌంట్ కు ప్రైవసీ పెట్టుకున్నట్లైతే కొంతమేరకు కేటుగాళ్ల నుంచి తప్పించుకోవచ్చు. ఫేస్ బుక్ లో అకౌంట్ డిటెయిల్స్, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, ఫొటోలు అందరికీ అందుబాటులో ఉండకుండా జాగ్రత్త పడాలని నిపుణులు పేర్కొంటున్నారు.
జాగ్రత్తగా ఉండాలె
సైబర్ నేరాల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్సప్, మెసెంజర్ చాటింగ్స్ పట్ల శ్రద్ధ వహించాలి. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్టులకు స్పందించవద్దు. నకిలీ ఐడీలతో ఎవరైనా డబ్బులు పంపించమని కోరితే ఫోన్ చేసి తెలుసుకోవాలి. సైబర్ నేరగాళ్ల కొత్తకొత్త ఆలోచనలు, వారు మోసం చేస్తున్న విధానాలపై పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా, ప్రకటనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.
-సింధు శర్మ, ఎస్పీ, జగిత్యాల
మూడుసార్లు క్రియేట్‌చేశారు
నా పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఐడీని ఇప్పటికే రెండుసార్లు క్రియేట్‌చేశారు. బుధవారం మూడోసారి జరిగింది. ఆ అకౌంట్నుంచి ఎవరికైనా మెసేజ్ వచ్చి ఉంటే వాళ్లకి కాల్ చేసి అడగండి. అప్పుడే అసలు వ్యక్తులెవరో మీకు తెలుస్తుంది.
– కరుణాకర్ రావు, సీఐ, పెద్దపల్లి జిల్లా
For More News..