మహాలయపక్షాలు 2025: పితృ దోషం ఎన్ని తరాలు వెంటాడుతుంది.. ఆస్తులే కాదు... పాపాలు కూడా వస్తాయట..!

మహాలయపక్షాలు 2025:  పితృ దోషం ఎన్ని తరాలు వెంటాడుతుంది.. ఆస్తులే కాదు... పాపాలు కూడా  వస్తాయట..!

చాలామందికి ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా.. ఎవనికి ఎలాంటి హాని తలపెట్టకపోయినా.. అవమానాలు.. దూషణలు ఎదుర్కొంటుంటారు.. అంటే అలాంటి వారు  పూర్వీకులు చేసిన పాపాల ఫలితాలను అనుభవిస్తున్నారని గరుడపురాణం ద్వారా తెలుస్తుంది. 

పితృ దోషం కారణంగా వ్యక్తి జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అతను అనేక ఒడిదుడుకులను అనుభవించవలసి ఉంటుంది. దీని కారణంగా కొన్నిసార్లు మీకు సమస్యలు ఎందుకు వస్తాయో మీకు అర్థం కాదు. పితృ దోషం ఒక తరాన్ని మాత్రమే కాకుండా తదుపరి తరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి.

 పూర్వీకుల ఆత్మ కలత చెందితే పితృ దోషం వస్తుంది.  మరణం తర్వాత శ్రద్ధ, తర్పణం, పిండదానం సరిగ్గా చేయకపోతే అలాంటి వారిని పితృదోషం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు.  ఈ దోషం వ్యక్తి కర్మ ప్రకారం సంభవిస్తుంది. ఒక వ్యక్తికి మంచి కర్మ ఉంటే, పిత్రు దోషం ప్రభావం తక్కువగా ఉంటుంది. 

పితృదోషం ఉంటే  సమస్యలు ఎందుకు వస్తాయో  అర్థం కాదు. పితృ దోషం ఒక తరాన్ని మాత్రమే కాకుండా తదుపరి తరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి.

గరుడ పురాణం ప్రకారం, పితృ దోషం మూడు నుండి ఏడు తరాలను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం ముఖ్యంగా తండ్రులు, తాతలు, ముత్తాతలకు బలంగా ఉంటుంది. కాబట్టి, వారి మరణం తర్వాత అన్ని ఆచారాలను సక్రమంగా నిర్వహించడం అవసరమని పండితులు చెబుతున్నాయి. 

పూర్వీకుల దోషం పెరిగితే ఏడు తరాలు ఈ సమస్యతో బాధపడాల్సి రావచ్చు. కాబట్టి, జ్యోతిష్య, మతపరమైన అధ్యయనాల ప్రకారం పక్షం రోజుల పాటు తగిన కర్మలు చేయడం ద్వారా పూర్వీకులను గౌరవించడం చాలా అవసరం.

 పితృ దోషాన్ని తొలగించడానికి శ్రాద్ధం..  పిండదానం, తర్పణం చేయడం అవసరమని గరుడ పురాణంలో చెప్పబడింది.  పితృ దోషంతో ఇబ్బంది పడే వారు  వంధ్యత్వం, వివాహంలో సమస్యలు, వ్యాపారంలో ఆర్థిక నష్టం, ఆరోగ్యం సరిగా లేకపోవడం, కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురికావడం, ఇంట్లో నిరంతరం ఉద్రిక్త వాతావరణం ఉంటాయి .

వంశపారపపర్యంగా ఆస్తులతో పాటు పాపాలు కూడా వస్తాయి.  అయితే ఆస్తిని  ఖర్చుపెట్టుకుంటే పోతుంది.  కాని పితృ దోషాల వలన సంక్రమించిన పాపాలను కొన్ని ఆధ్యాత్మిక సూత్రాల ద్వారా మాత్రమే పొగొట్టుకొనగలమని పండితులు చెబుతుతున్నారు. 

 పెద్దలు పుణ్య కార్యాలు చేస్తే ఆ వంశం తరతరాలుగా సుఖ సంతోషాలతో ఉంటుంది. అదే పూర్వీకులు పాపాలు చేస్తే (తెలుసు కావొచ్చు తెలియక కావొచ్చు )...ఆ కర్మలు ఆ వంశాన్ని పట్టి పీడిస్తాయి.ఈ విషయం తెలియనివారంతా ఏం పాపం చేశాం ఈ కర్మ అనుభవిస్తున్నాం అనుకుంటారు కానీ పాపం మీరుమాత్రమే చేయాల్సిన అవసరంలేదు..అది కూడా వారసత్వంగా వచ్చినదే..పితృదోషం ఐదు తరాలవారిని వెంటాడుతుంది. అందుకే మీరు పుణ్యకార్యాలు చేయకపోయినా పర్వాలేదు, ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ పాపాలు చేసి మీ తర్వాతి తరాల బాధకు కారణం కావొద్దని పండితులు సూచిస్తున్నారు. 

పితృదోషం ఉన్నప్పుడు పూర్వీకులకు ఆభ్దీకాలను సక్రమంగా నిర్వహించడం, అమావాస్య రోజు తర్పణాలు వదలడం, పుష్కరాల సమయంలో పిండప్రదానాలు చేయడం.. మహాలయ పక్షాల్లో వారికి తర్పణాలు వదలడం ద్వారా  మంచి ఫలితాలను పొందుతారు.