గండిపేట, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ టికెట్ల కలకలం రేగింది. శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో 8 మంది ప్రయాణి కులు దోహా వెళ్లేందుకు ఖతార్ ఎయిర్లైన్స్ (క్యూఆ 5-4777) విమానం ఎక్కారు. వారి టికెట్లు పరిశీ లించగా నకిలీగా తేలింది.
లింగం, కోదండరావు, వంక డిల్లివాపు, రాజేశ్వర్రావు, అప్పారావు, శ్రీ నివాసరావు, ఆనందరావు, నాయుడును ఎయిర్ పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులకు అప్ప గించారు. నకిలీ టికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
