కల్తీగాళ్లు దేన్నీ వదట్లేదు..సిమెంట్ కలిపి ఎల్లిపాయలను కల్తీ చేస్తున్న కంత్రీగాళ్లు..

కల్తీగాళ్లు దేన్నీ వదట్లేదు..సిమెంట్ కలిపి ఎల్లిపాయలను కల్తీ చేస్తున్న కంత్రీగాళ్లు..

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో అక్రమ మార్గంలో లాభాలు ఆర్జించేందుకు కల్తీగాళ్లు గాళ్లు దేన్నీ వదలట్లేదు.. నూనెలు, పసుపు, కారం, పప్పులు లతోపాటు అల్లం, వెల్లుల్లి వంటి ఆహారపదార్థాలను కల్తీ చేసి అమ్ముతున్నారు. మహారాష్ట్రలో వెల్లుల్లిని సిమెంట్ తయారు చేసి అమ్ముతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

అసలు వెల్లుల్లికి, నకిలీ వెల్లుల్లికి తేడా గుర్తించలేనంతగా కల్తీ చేసి అమ్ముతున్నారు కంత్రీగాళ్లు.. సిమెంట్ తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రలోని అలోకా జిల్లాలో ఈ నకిలీ సిమెంట్ వెల్లుల్లిని తయారు చేసి విక్రయిస్తున్నారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న సిమెంట్ తో తయారు చేసిన వెల్లుల్లిని నకిలీదని ఏమాత్రం గుర్తించలేం.. తలకిందులు చేస్తే గానీ  అది సిమెంట్ తో తయారు చేసినట్లు అర్థమవుతుంది..తినే ఆహార పదార్థాలను దేనినీ వదలడం లేదు కంత్రీగాళ్లు.. అన్నింటినీ కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడుతున్నారని ఈ వీడియా చూసిన ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఇలాంటి నకిలీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న దుకాణాలపై నిఘా పెంచాలని కోరుతున్నారు.