
హైదరాబాద్ లో నకిలీ ఇన్సూరెన్స్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 11 మందిని SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ప్రింటర్లు, స్కానర్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్. ఈ ముఠాలో రమేష్ అనే వ్యక్తి కీలక నిందితుడని.. పొల్యూషన్ చెక్ చేసుకునేందుకు వచ్చేవారే వీళ్ల టార్గెట్ అని చెప్పారు. 2వేల వెహికల్స్ కు ఫేక్ ఇన్సూరెన్స్ చేసినట్లు గుర్తించామన్నారు. ఇన్సూరెన్స్ చేసేముందు వెరిఫై చేసుకోవాలని సూచించారు సీపీ సజ్జనార్.