
హైదరాబాద్ : ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. చైతన్యపురిలో జాయిన్ అస్ కన్సల్టెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షర అభియాన్ పథకం కింద ఔట్ సోర్సింగ్ విధానంలో కో ఆర్డినేటర్లుగా నియమిస్తామంటూ 185 మంది నిరుద్యోగుల దగ్గర కోటీ 48 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి కారు, 6 మొబైల్ ఫోన్లు, నగలు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.