అక్షరం తేడాతో మాయ .. గూగుల్ సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫేక్ సైబర్ లింక్స్ 

అక్షరం తేడాతో మాయ .. గూగుల్ సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫేక్ సైబర్ లింక్స్ 
  • క్లిక్ చేసిన వెంటనే మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,స్పైవేర్ ఎటాక్స్
  • 20  వేల యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ల 5  వేల అకౌంట్లు బ్లాక్
  • అలర్ట్ గా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్, వెలుగు :  ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్​లో  ఫేక్ యూనిఫామ్ రిసోర్స్ లోకేటర్(యూఆర్ఎల్)పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్ సీఎస్ బీ) స్పెషల్ ఫోకస్ పెట్టింది.  గూగుల్ సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సోషల్ మీడియా, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్ చేస్తోంది.  బ్యూరో ఏర్పాటు చేసిన నాటి నుంచి మొత్తం 20  వేలకు పైగా యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించింది.  ఫేక్  వెబ్ సైట్స్, సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధిత ప్రొవైడర్లను అలర్ట్ చేస్తోంది.  వీటిలో 5  వేలకు పైగా నకిలీలను గుర్తించింది.  2 వేలకు పైగా అకౌంట్లను బ్లాక్ చేసింది. ఇందుకోసం లీగల్ మెయిలింగ్ టీమ్ ప్రత్యేకంగా పనిచేస్తోంది.

క్షణాల వ్యవధిలోనే..

ప్రస్తుత డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సైబర్ నేరగాళ్లు కంటికి కనిపించని మాయ చేస్తున్నారు. క్షణాల వ్యవధిలో రూ. లక్షలు కొట్టేస్తున్నారు. ఇందుకోసం గూగుల్ సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డాగా చేసుకున్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈ– కామర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైట్లనే సైబర్ నేరగాళ్లు టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అక్షరం మార్చి ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేస్తున్నారు. ఒరిజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహ ఫీచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా కాపీ చేస్తున్నారు.  

నెటిజన్లు ఏ మాత్రం గుర్తించలేని విధంగా నకిలీ యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపేర్ చేస్తున్నారు. https:// యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్​లో  మార్పులు చేసి ఫేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెడుతున్నారు. గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా ప్రముఖ సెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇలాంటి ఫేక్ యూఆర్ఎల్స్ ఎక్కువగా ఉన్నట్లు టీఎస్ సీఎస్ బీ గుర్తించింది.  వీటితో సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎటాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.