ఫేక్ వీడియో : ఇలాంటి చేష్ఠలు చేస్తే తాట తీస్తాం : ఆర్టీసీ వార్నింగ్

ఫేక్ వీడియో : ఇలాంటి చేష్ఠలు చేస్తే తాట తీస్తాం : ఆర్టీసీ వార్నింగ్

జనాలకు సోషల్ మీడియా పిచ్చి రోజు రోజుకు ఎక్కువైపోతోంది. రీల్స్ చేసి పాపులర్ అవ్వాలని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు కొందరు. ఆ మధ్య టిక్ టాక్ యాప్ వల్ల చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలని వింత వింత చేష్టలు చేశారు. ఇక ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ పిచ్చి మొదలైంది. ప్రస్తుతం  సోషల్​ మీడియాలో ఓ ఫేక్​ వీడియో వైరల్​ అవుతుంది.   వివరాల్లోకి వెళ్తే ...

సోషల్​ మీడియాలో   TGSRTC గురించి ఓ ఫేక్​ వీడియో హల్​ చల్​ చేయడంతో ఎండీ సజ్జనార్​ స్పందించి గట్టిగ వార్నింగ్​ ఇచ్చారు.  రీల్స్ ద్వారా డబ్బులతో పాటు పాపులారీటీ కూడా వస్తుండటంతో చాలా మంది రకరకాల వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. జనాలు కూడా వాటిని ఎగబడి మారీ చూస్తున్నారు. కాని కొన్ని ఫేక్​ వీడియోలు కూడా వైరల్​ అవుతున్నాయి. కాగా సోషల్ మీడియాలో రీల్స్​ పోస్ట్​ చేయడం వల్ల  సినిమా అవకాశాలు అందుకున్నావారు కూడా ఉన్నారు కొంతమంది పాపులారిటీ కోసం వీడియోలను ఎడిటింగ్​ చేసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు.  

కొంతమంది తమలో ఉన్న యాక్టింగ్, డాన్స్, కామెడీ టాలెంట్ ను బయట పెడుతూ అవకాశాలు అందుకుంటున్నవారు కొందరుంటే.. మరికొంతమంది మాత్రం  ఫేక్​ వీడియోలు సృష్టిస్తున్నారు.  ఇలా సృష్టించేటప్పుడు వారి వ్యక్తిగతమైతే పరవాలేదు.. పోనీలే క్రేజ్​ కోసం ఏదో చేశాడులే అనుకుంటారు.  కొంతమంది వేరే వారిని.. ఇతర సంస్థలకు చెందిన వీడియోలను ఎడిట్​ చేస్తూ  క్రియేటివిటీ కోసం తెగ ఆరాటపడుతున్నారు.  ఓ వ్యక్తి  TGSRTC బస్సు వెళుతుంటే రోడ్డు మధ్యలోకి వచ్చి బస్సు కింద పడతాడు.  బస్సు ఆగకుండా వెళుతుంది.  ఈ వీడియో వైరల్​ కావడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ స్పందించారు.  ఇది ఫేక్​ వీడియో అని .. ఇలా పాపులర్​ కోసం ఆర్టీసీ పేరును ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదని ముక్కు సూటిగా సోషల్​ మీడియా వేదికగా ట్విటర్​ ప్లాట్​ ఫాంలో  గట్టిగా వార్నింగ్​ ఇచ్చారు. 

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియో ఫేక్‌. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్‌ మీడియాలో  పాపులర్‌ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్‌ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్‌ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిటెడ్‌ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా  కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను #TGSRTC యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని TGSRTC MD సజ్జనార్​ ట్వీట్​ చేశారు.