ప్రయాణికులతో సికింద్రాబాద్ కు చేరుకున్న ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​

ప్రయాణికులతో సికింద్రాబాద్ కు చేరుకున్న ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​

సికింద్రాబాద్ : అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకుంది. ప్రమాదస్థలం నుంచి11 బోగీల్లో ప్రయాణికులను తీసుకుని ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోని ప్లాట్ ఫాం నంబర్ వన్ కు చేరుకుంది.

ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్ ప్రయాణికుల కోసం ముందుగానే వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ను రైల్వేశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. బాధిత ప్రయాణికులు రాగానే అందించారు. ఇంకోవైపు.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో హెల్ప్ లైన్ నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. 

ALSO READ :Falaknuma Express: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదాల హిస్టరీ ఇదే.. ఇది నాలుగోసారి

ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్ అగ్ని ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. హౌరా నుంచి సికింద్రాబాద్​వస్తుండగా ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​ట్రైన్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. 

రిజర్వేషన్ లేకుండానే కొంతమంది రైలు ఎక్కారని ప్రత్యక్షసాక్షులు( ప్రయాణికులు) చెప్పారు. ప్రమాదంలో తమ లగేజీ మంటల్లో పూర్తిగా కాలిపోయిందని కొందరు ప్రయాణికులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది.