రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. చలు గాలుల ప్రభావంతో ప్రజలు కాలు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఆర్లి-టి లో అత్యల్పంగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పిప్పల్ దరిలో 7 డిగ్రీలు, ఆదిలాబాద్ 7.2, జైనథ్ 7.5, తాంసిలో 7.5, బరంపూర్ లో 7.7, చప్రాలలో 7.8, లోకారిలో 7.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురంభీం జిల్లాలోని సిర్పూర్ లో 6.1 డిగ్రీలు, వంకులం 8.7, రెబ్బనలో 8.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిర్మల్ జిల్లా పెంబిలో 8.7 డిగ్రీలు, విశ్వనాథ్ పెట్ లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.