
నిర్భయ కేసులో దోషులుగా ఉన్న నలుగురు నిందితుల కుటుంబసభ్యులు తమకు కారుణ్య మరణం పొందేందుకు అనుమతించాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. తల్లిదండ్రులు, పిల్లలు, తోబుట్టువులు లేఖ రాసిన వారిలో ఉన్నారు. మన దేశంలో పెద్ద తప్పులు చేసిన వారికి కూడా క్షమాభిక్షను ప్రసాదించారని లేఖలో వారు తెలిపారు. ప్రతీకారం అనేది అధికారానికి నిర్వచనం కాదని… క్షమించడంలో కూడా అధికారం ఉందన్నారు.
ఈనెల 20న తెల్లవారుజామున 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. అంతేకాదు ఇప్పటికే నలుగురు దోషులు పెట్టుకున్న క్షమాభిక్షలను రాష్ట్రపతి తిరస్కరించారు.