రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. ఫ్యామిలీ మొత్తం అరెస్టు

రియల్ ఎస్టేట్ పేరుతో ఘరానా మోసం.. ఫ్యామిలీ మొత్తం అరెస్టు

రియల్ ఎస్టేట్ మోసాలతో పాటు నకిలీ వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఓ కుటుంబాన్ని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ పై అవగాహన ప్రోగ్రామ్స్ అంటూ హైదరాబాద్ కు చెందిన శివ కుమార్ అనే తన కుటుంబ సభ్యులతో కలిసి యూట్యూబ్ లో వీడియోలు, ప్రకటనలతో ఘరానా మోసాలకు పాల్పడ్డాడు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  రియల్ ఎస్టేట్ లో 50 శాతం మాత్రమే పెట్టుబడి పెట్టి, మరో 50 శాతం తన కస్టమర్లతో పెట్టించాడు.  మీమాంస, జోషిక ఇన్వెస్టర్స్ క్లబ్ లో 50 శాతం పెట్టుబడులకు 200 శాతం ప్రాఫిట్ చూపిస్తానని నమ్మించి పెట్టుబడులు పెట్టించారు.  ఆ తర్వాత మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు పోలీసులను  ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు నిందితుడు శివకుమార్.. దాదాపు రూ.10 కోట్లకు పైగా శివకుమార్ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు.  శివ కుమార్ తో పాటు భార్య స్వర్ణలత కుమారుడు జశ్వంత్.. మరో వ్యక్తి శ్రీనివాస రావును అరెస్ట్ చేశారు. వీరికి సంబంధించిన ఆస్తులను అధికారులు ఫ్రీజ్ చేశారు. గతంలోను శివకుమార్ పై అనేక కేసులు ఉన్నాయి. గతంలో 88 రోజులపాటు జైల్లో ఉన్నాడు. జైలు నుండి బయటకు రాగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన శివకుమార్..  మీ మాంసా వెల్ నెస్ రిసార్ట్స్ , మెడికల్ క్యాంపుల పేరుతో మోసాలు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.